సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పార్వతి పురం మన్యంలో నేడు, బుధవారం జరిగిన అమ్మవడి’ కార్యక్రమంలో బటన్ నొక్కి సీఎం జగన్ అమ్మల అకౌంట్లలోకి నిధులు విడుదల చేసారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. పదిరోజులపాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి కొనసాగుతోంది. అన్ని స్కూల్స్ , ఇంటర్ కాలేజీల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి నిధులు జమవుతున్నాయి. ఇప్పటివరకు అమ్మఒడి క్రింద రూ.26,067.28 కోట్లు అందజేశాం. అవినీతి, వివక్ష లేకుండా నేరుగా నిధులు అందజేస్తున్నాం. తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకే అమ్మ ఒడి పథకం … ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన పిల్లలు రావాలనే లక్ష్యంతో రాష్ట్రంలో పిల్లల విద్య కోసం పనిచేస్తున్నాం. రోజుకో మెనూతో విద్యార్థులకు గోరుముద్ద అం దిస్తున్నాం . పిల్లలకు తొలిసారిగా బైలింగ్వు ల్ పుస్తకాలు అందజేస్తున్నాం . పిల్లలకు సులువుగా అర్థమయ్యేం దుకు డిజిటల్ బోధనను తీసుకొచ్చాం, పిల్లలకు ట్యాబ్స్ కూడా అందించాం . నాడు-నేడు ద్వారా 45వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం అన్నారు.
