సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో ఈరోజు ఉదయం 10.30 గం.ల సమయంలో భీమవరం విస్సాకోడరు వంతెన వద్ద శ్రీ లక్ష్మి విఘ్నేశ్వర రైస్ మిల్లు రూఫ్ పై ధాన్యం లిఫ్టింగ్ యంత్రానికి వెల్డింగు చేయుచుండగా, ప్రమాదవశాత్తూ మంటలు వచ్చి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు. కొంత మేర ధాన్యం మాత్రం కాలిందని సమాచారం. మంటలు పైకి రావడంతో మిల్లు నిర్వాకులు కట్రెడ్డి వినోద్ కుమార్ పిర్యాదు చెయ్యడంతో సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తీసుకోని వస్తున్నారు.
