సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొదటి విడుత వారాహి యాత్రలో ముగింపు గా భీమవరం లో నేటి రాత్రి జరిగిన జనసేన పార్టీ భారీ బహిరంగ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ ఫై కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 లో ఇక్కడి నుండి పోటీ చేశాను… ఈసారి భీమవరం నుండే పోరాడతాను.. గోదావరి జిల్లాల లో జనసేన 34 చోట్ల పోటీ చేసి తాడో పేడో తేల్చుకొంటాను.. గోదావరి జిల్లాల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం.( ఈ సవాల్ తో పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలలో తెలుగు దేశం పార్టీ తో పొత్తు ను దూరంగా పెట్టేసి నట్లు క్లారిటీ ఇచ్చారు..) జగన్ ఇచ్చిన హామీలలో యువతకు 2.50 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది.? 2 లక్షల మంది వాలంటీర్లు ను తయారు చేసి వారికీ 5వేలు జీతాలు ఇస్తూ మోసం చేస్తుందని, మద్యపాన నిషేదం పేరిట వైసీపీ ప్రభుత్వం జనాలను మోసం చేసిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి అప్పుల బాధ ఎక్కువై కాలేజీ విద్యార్థులకు పీజు రియార్స్మెంట్ ఇవ్వలేకపోతుందని, ప్రజల కష్టాలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. కేసులు పెట్టి అణచివేస్తారని..ఇక్కడ వారి పార్టీ నుండి గెలిచిన ఎంపీ రఘురామా కృష్ణంరాజు ను కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టి హింసించకుండా వదలలేదని ఆరోపించారు. అయిన భయపడకుండా వైసిపి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో జనసేన పోరాడుతున్నామని పవన్ అన్నారు. భీమవరం లో బడుగుల తరపున పోరాటం అని ఫ్లక్సీ లు కట్టి వివాదం రాజేశారని వాటిపై స్థానిక నేతలు ప్రశ్నిస్తే..వారిపై కేసులు పెట్టారని అలానే తాడేరు వంతెన కోసం పాదయాత్ర చేసిన జనసేన నేతలపై కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారని .. కులం పేరు పెట్టుకునే వ్యక్తికి క్లాస్ వార్ గురించి మాట్లాడే అర్హత లేదు. అని పవన్ కల్యాణ్ అన్నారు. భీమవరం లో జనసేన కార్యకర్తలు బైకులపై సైలెన్సర్ తీసేసి శబ్దాలతో తిరుగుతారని విమర్శించే నేతలు ముందుగా తమ నోటికి సైలెన్సర్స్ బిగించుకోవాలని రెచ్చగొట్టుడు మాటలు తగ్గించుకోవాలని..వారికీ బాగా సమాధానం చెప్పను కదా? అని సభ నుద్దేశించి అన్నారు. బీసీలకు సంపూర్ణ రాజ్యాధికారం కావాలి. ఇసుక రీచ్‌లను 3 కంపెనీలకే కట్టబెట్టారు. ఒక్క కులమే అధికారం చెలాయిస్తామంటే ఎలా? అది రాజ్యాంగ విరుద్ధం.అని విమర్శల వర్షం కురిపించారు పవన్ కళ్యాణ్..
