సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, శనివారం మీడియాతో మాట్లాడుతూ.. భీమవరంలో పవన్ కళ్యాణ్ వారాహి రథయాత్ర ప్రసంగం లో పస లేదన్నారు. జనసేన అంటే ప్యాకేజీ పార్టీ అని.. అబద్దాల పార్టీ అని అన్నారు. సీఎం జగన్ అయితే మ్యానిఫెస్టోను భగవద్గీతా, బైబిల్, ఖురాన్‌గా భావిస్తారన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా భావించే వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. పవన్ ప్రజలతో పాటు తనని తాను ఎందుకు మోసం చేసుకుంటారని ప్రశ్నించారు. అల్లూరి సీతారామ రాజు, చేగువీర, పొట్టి శ్రీరాములు, పుచ్చలపల్లి సుందరయ్య ,భగత్ సింగ్ వంటి మహనీయుల పేర్లు చెబుతు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని , ప్రజల స్వేచ్ఛ కోసం నిస్వార్ధంగా పోరాటం చేసిన ఆ మహనీయులు ఎక్కడ? చంద్రబాబు ను సీఎం చెయ్యాలని లక్ష్యంగా పని చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఆ మహనీయులు అందరు చంద్రబాబు మొఖం లో పవన్ కు కనిపిస్తున్నారేమో?అంటూ ఎద్దేవా చేసారు. ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు హింసిస్తే కులాలకు అతీతంగా అన్ని వర్గాలు బాధపడ్డాయన్నారు. పవన్ భీమవరం లో పోటీ అంటే గతంలోనే భయపడలేదని, ఇప్పుడు పవన్ అనే వ్యక్తి మోసపూరిత నైజం ప్రజలందరికి తెలిసిపోయిందని అన్నారు. గతంలోనే జనసేన పార్టీ వారు దాష్టీకాలు భరించలేక ప్రజలు ముందే ఓడించారని.. 2019లో టీడీపీ తో విడివిడిగా పోటీ చేసామంటూ లోపాయి కారి ఒప్పదం వల్లే.. చంద్రబాబు భీమవరం ఎన్నికల ప్రచారానికి రాలేదని అందరికి తెలుసునన్నారు. అయితే మరల భీమవరం ప్రజలకు చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబు మద్యపాన నిషేధం ఎత్తేశారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని సపోర్ట్ చేస్తూ మద్యమద్యపాన నిషేధం జనసేన కు సాధ్యం కాదంటున్నారు..జగన్ సర్కార్ ప్రజలకు చేస్తున్న అభివృద్ధి ని పవన్ కళ్యాణ్ ఓర్వలేకపోతున్నారు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *