సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు జిల్లాలోఇటీవల పెరిగిపోతున్న అరాచక ఘటనలు, మత్తు పదార్ధాల విక్రయాలు , వ్యభిచారం, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం వెయ్యాలని ఎస్పీ డి.మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు.. ప్యూహాత్మకంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ ప్రాంతాల్లోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పలు లాడ్జిలను, పోలీసులు గత ఆదివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా రహదారి ప్రమాదాల నివారణ, గంజాయి, గుట్కా, ఖైనీ అక్రమ రవాణాను నివారణ కోసం వాహనాల తనిఖీలను నిర్వహించి పలువురు వాహనదారులకు జరిమానాలు విధించారు. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో పేకాటలు, కోడిపందాలు నివారణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు జిల్లా పోలీసు యంత్రాంగం తెలిపింది.
