సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసేలా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉన్న సేవలకు 104 వాహనాలతో తో కలిపి ప్రస్తుతం సేవలు అందిస్తున్న1088 అంబులెన్సు లకు అదనంగా 146 కొత్త అంబులెన్స్ లను కొనుగోలు చేసి నేడు, సోమవారం సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాం ప్ కార్యా లయం వద్ద జెండా ఊపుతూ ప్రారంభించారు. 2019 లో జగన్ సర్కార్ వచ్చాక 108 వ్య వస్థను బలోపేతం చేస్తూ 2020లోనే మండలానికి ఒక 108అంబులెన్స్ ను .ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 108 అంబులెన్స్ లు రోజుకు 3,089 కేసులకు అటెండ్ అవుతున్నాయి. ఎందరికో ప్రాణదానం చేస్తున్నాయి.ఇలా 2020 జూలై నుంచి ఇప్పటి వరకు 33,35,670 ఎమర్జెన్సీ కేసుల్లో అంబులెన్స్లలు విశేష సేవలందించాయి.
