సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత స్వాతంత్ర సమరనాదానికి ప్రతిరూపం, బ్రిటిషర్ల పాలిట సింహస్వప్నం, మన్యంలో విప్లవాగ్ని రగిలించి, తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా భీమవరంలోని అల్లూరి సీతారామ రాజు నగర్ లోని 35 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహం వద్ద నేడు, మంగళవారం ఉదయం పలు దేశభక్తి ప్రదర్శనలు నిర్వహించారు. తదుపరి రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు, ప్రభుత్వ విప్ ప్రసాదరాజు, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఉండి ఎమ్మెల్యే రామరాజు ఎమ్మెల్సీ వంకా రవీందర్, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు , గాదిరాజు సుబ్బరాజు తదితర నేతలు ఆ మహనీయుడికి ఘన నివాళ్లు అర్పించారు. అల్లూరి సీతారామ రాజు మన భీమవరం ప్రాంతంవాసి కావడం ఇక్కడే ప్రాధమిక విద్య బుద్దులు నేర్చుకోవడం నేపథ్యంలో ప్రధాని మంత్రి మోడీ ఇక్కడ అల్లూరి సీతారామ రాజు 35 అడుగుల కాంస్య విగ్రహం ను ప్రారంభించడం తెలుగు రాష్ట్రాలలో పాటు భీమవరం చరిత్రలో అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి భవిషత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొంటు వక్తలు ఘన నివాళ్లు అర్పించారు.
