సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ నేటి బుధవారం సాయంత్రం 4:30కి ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోదీతో దాదాపు గంటా ఇరవైనిమిషాల పాటు భేటీ అవ్వడం పలు అంశాలపై చర్చించడం పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు.. కేంద్రం లోని బీజేపీ కూడా ముందస్తు ఎన్నికలకు ఆసక్తి చూపుతుంది అన్న వార్తల నేపథ్యంలో .. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలలో దక్షిణాదిన బీజేపీ కి తెలంగాణతో పాటు ఎక్కడ పూర్తీ ఆశలు పెట్టుకోలేని పరిస్థితుల నేపథ్యంలో.. మరో ప్రక్క అమిత్ షా, నడ్డా వంటి కీలక బీజేపీ నేతలు ఏపీకి వచ్చి ఇక్కడ వైసిపి సర్కార్ ను తీవ్ర స్థాయిలో విమర్శించిన నేపథ్యంలో.. ప్రధాని మోడీతో సీఎం జగన్ జరిగిన ఈ సుదీర్ఘ భేటీ కి చాల ప్రాధాన్యత చోటు చేసుకొంది. అయితే అధికారిక వర్గాలు మాత్రం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో సీఎం జగన్ చర్చించారంటున్నారు. అలాగే ముందుగా మధ్యా హ్నం 2.30 గం టలకు కేం ద్ర హోం మం త్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసిం ది. 45 నిమిషాల పాటు కొనసాగిన సమావేశంలో.. రాష్ట్రానికి రావాల్సి న నిధులు, బకాయిలపై చర్చించినట్లు సమాచారం . ప్రస్తుతం ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ తో సీఎం జగన్ సమావేశం అయ్యారు.
