సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ పశు సంక్రమిక వ్యాధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు, గురువారం రేబిస్ వ్యాధి సోకకుండా భీమవరం లోను మరియు జిల్లా వ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సినేషన్(టీకాలు) వేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా 31,918 కుక్కలు ఉన్నట్లు పశు శాఖ అధికారులు తాజగా లెక్క తేల్చారు. జిల్లాలో భీమవరంలో అత్యధికంగా 5,025 కుక్కలు ఉండగా అత్యల్పంగా యలమంచిలిలో 385 ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. వీటిలో జిల్లాలో సుమారు 6 వేల వీధి కుక్కలు, మిగిలినవి 25,000 పెంపుడు కుక్కలు కావడం విశేషము. కుక్కలకు టీకాలు వేయడానికి 13 వేల డోస్‌లు నేడు, ప్రాంతీయ పశు వైద్య శాలలలో సిద్ధంచేసారు. నేటి గురువారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు టీకాలు ఉచితంగా అందిస్తారు. జిల్లాలో మొత్తం 75 చోట్ల ఈ టీకాలను పశు వైద్యులు వేస్తుండటం గమనార్హం.
