సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ ‘సలార్’ మొదటి భాగం.. టీజర్తో నేడు, గురువారం బరిలోకి దిగాడు. ‘కేజీయఫ్’ సిరీస్ లాంటి బ్లాక్ బస్టర్ను అందించిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. బాహుబలి ఇమేజ్ ఉన్న ప్రభాస్ కు సరైన మాస్ సినిమా క్లాస్ టేకింగ్ తో చేస్తే ఎలా ఉంటుందో..బొగ్గు గనుల ప్రపంచాన్ని టీజర్లో చూపించాడు. టీజర్ను ‘ది మోస్ట్ వైలెంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వైలెంట్’ పేరుతో మేకర్స్ తాజాగా విడుదల చేశారు. అయితే టీజర్ నిడివి నిముషం మాత్రం ఉండటం కొంత నిరాశ కలిగించింది. అయితే ఓ రకం గా నేటి ఉదయం 5: 12 నుంచి యూట్యబ్లో తుఫాన్ మొదలైంది. దేశవ్యాప్తంగా ప్రభాస్ కు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఈ టీజర్ను వారు మినిమమ్ పదిసార్లు అయినా ఇప్పటికే చూసి ఉంటారు. ఈ టీజర్లోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను వారు గుర్తిం చారు. దీంతో గత కెజిఎఫ్ సినిమా 2 భాగాల స్వీక్వెల్ కు సలార్ కొనసాగింపు అని తేలిపోయింది. ఇందులో రాఖీ భాయ్ యాష్ కూడా కొద్దీ సేపు కనపడతారని వార్త నిజం అనుకోవచ్చు.. అది నిజమేనని తెలిపేలా రెం డు ఫోటోల క్లూ లను కూడా వదిలారు. సెప్టెంబరు 28న సాలార్ మొదటి భాగం విడుదల కానుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఓపెనింగ్స్ దద్దరిల్లిపోతాయి అని వేరే చెప్పనక్కరలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *