సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీకాళహస్తి సమీపం లోని మెట్ట కండ్రిగ వద్ద నేటి ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రాధమిక సమాచారం ప్రకారం ఎదురుగా వస్తున్న లారీని హైస్పీడ్‌లో ఉన్న కారు ఢీకొనడం తో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందగా, మరోఇద్దరు త్రీవంగా గాయపడ్డారు. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో వీరు విజయవాడ కు సంబంధించిన వారీగా భావిస్తున్నారు. కాగా, వీరంతా తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుడగా ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్ లో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
