సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కృషి తో . ఇంటింటికి సురక్షిత తాగునీరందించే అమృత్‌ 2.0 పథకం కింద ఇప్పటికే రూ.670 కోట్లతో పనులు చేపట్టారు. వాటిలో సుమారు 15 శాతం పనులు ఇప్పటికే పూర్తీ అయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు. ఎట్టి పరిస్థితులలో 2028 జనవరి నాటికి జిల్లా వ్యాప్తంగా ప్రతి కుళాయి కనెక్షన్ ఉన్న ఇంటికి పూర్తిస్థాయిలో మంచినీటి సరఫరా ఇచ్చే లక్ష్యం తో పని చేస్తున్నారు.. నీటిశుద్ధి కేంద్రాలు, గ్రిడ్‌ లైన్ల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతుంది. భీమవరం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, ఆకివీడులో ఇప్పటికే పనులు ఉపండుకొన్నాయి. అసెంబ్లీ డిఫ్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు కృషితో ఆకివీడుకు ఈ పథకం ద్వారా రూ.73.08 కోట్లు మంజూరయ్యాయి భీమవరం నుంచి ఆకివీడు కు 21 కిలోమీటర్ల పైపులైను వేస్తున్నారు. ఆకివీడుకు వేసవిలో తాగునీటి సమస్య వచ్చినప్పుడు ఈ పైపులైన్‌ ద్వారా నీరు పంపిస్తారు. పరిమళ లాకుల నుంచి 30 కోట్లతో పైపులైన్‌ పనులు ను ఇప్పుటికే మొదలు పెట్టారు. దీనివల్ల గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అవుతుంది. స్థానిక సంత మార్కెట్‌ ప్రాంతంలో 8.5 ఎంసీడీ ఫిల్టరేషన్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు నిర్మాణానికి పనులు చేస్తున్నారు. ధర్మాపురంలో నూతన వాటర్‌ ట్యాంకు, పైపులైను పనులు జరుగుతున్నాయి. పట్టణంలో ఏళ్ల తరబడి పాత పైపులైన్లు ను తొలగించి హెచ్‌పీపీ పైపులు 26 కిలోమీటర్ల మేర వేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆకివీడులో 6,500 కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. పైపులైన్లు మార్చడంతో కొత్తగా సుమారు మరో 4వేలు పైగా కుళాయి కనెక్షన్లు పెరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *