సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసుకొన్నా ఏపీ ఆక్వా ట్రేడర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్య క్షుడు భీమాల శ్రీరామమూర్తి భీమవరంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆక్వాఎగుమతుల్లో సంక్షోభం కారణంగా రాష్ట్రం లోని రొయ్యల రైతులు, ఎగుమతిదారులు ఇబ్బందులు పడుతున్నా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆక్వా ఎగుమతిదారులు, రైతులకు సంధాన కర్తలుగా వ్యవహరిస్తామని ప్రకటించారు. రైతుల నుండి రొయ్యల కొనుగోలు చేసే ట్రేడర్స్ కు మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. రైతులకు రొయ్యలు కొనుగోలుచేసిన వెంటనే డబ్బు చెల్లిస్తున్న ట్రేడర్స్ కు ఎగుమతుల అనంతరం సరుకు తీసుకొన్న కొనుగోలు దారుల నుండి డబ్బు రావడం లేదని కొన్నిసమయాల్లో ఇతర రాష్ట్రాల్లోని దిగుమతిదారులు మోసం చేయడం వల్ల ట్రేడర్స్ తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ట్రేడర్స్ నష్టపోకుండా ఉండేందుకు ఎంపెడా లో రిజిష్ట్రరయిన ట్రేడర్స్ మాత్రమే రొయ్యలు కొనుగోలు చేసే విధం గాచర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు శ్రీరామమూర్తి చెప్పా రు. సమావేశం లో గౌరవ సలహదారుడు తోటభోగయ్య , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రవిచంద్ర, కోశాధికారి కామన రాంబాబు, కన్వీనర్ ముతకన పిచ్చయ్య , తదితరులు పాల్గొన్నారు.
