సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం శివారు పెద్దమిరంలో జరుగుతున్నా అంతర్జాతీయ తెలుగు సంబరాలు – 2022ను మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా.. తెలుగు భాషను గౌరవించుకోవాలని, దేశంలో హిందీ తరువాత ఎక్కువ మంది మాట్లాడేది తెలుగు భాషేనన్నారు. ఈ వేదికపై తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన మహానుబావులును సత్కరించే అవకాశం లభించడం గర్వంగా ఉందన్నారు. కర్నాటకలో బళ్ళారి, హోస్పేట, సింధనూరులో వ్యవసాయం చేసేది పశ్చిమ గోదావరి వాసులేనని చెప్పారు. శాసనమండలి మాజీ ఉప సభాపతి, భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మమ్మీ, డాడీల స్థానంలో అమ్మా నాన్నల పిలుపును శాశ్వతం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష తియ్యదనాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే సంబరాలని కొనియాడారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ.. కవులు, రాజవంశీయుల వారుసులను తీసుకురావడం భాషా చరిత్రలో విశేషమన్నారు. ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చిన కేవీవీ కృష్ణంరాజు అక్కడ తెలుగు భాష మర్చిపోకుండా ఉండటానికి ఎంతో భాషాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. సినీ నటుడు సాయి కుమార్ తన కంచుకంఠంతో తెలుగు బాషా గొప్పతనం ఫై మాట్లాడిన మాటలు అందరిని కట్టిపడేశాయి.
