సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: సీఎం జగన్ నేడు, శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులకు 23.29 శాతం పీఆర్సీ ని ప్రకటించారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. నిన్నటి సమావేశం తర్వాత నా కుటుంబ సభ్యులైన ఉద్యోగుల ప్రతినిధులుగా మీరు చెప్పిన అన్ని అంశాలపైనా నిన్ననే సుదీర్ఘంగా కూర్చొని అధికారులతో చర్చించాను. ఈ ఉదయంకూడా మరోవిడత అధికారులతో మాట్లాడాను. నిన్న నేను 2–3 రోజుల్లో ప్రకటిస్తానని చెప్పాను. కానీ నిర్ణయాన్ని ఎంత వీలైతే అంత త్వరగా చెప్తే మంచిదని భావించి ఈ మేరకు ఉదయం కూడా సమావేశం పెట్టాను అన్నారు. అయితే మరో శుభవార్త ఏమిటంటే.. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నేడు , శుక్రవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయని ప్రభుత్వం తెలిపింది. పెండింగ్‌ డీఏలు జనవరి నుంచి చెల్లించనున్నారు. 2020 ఏప్రిల్‌ నుంచి కొత్త పీఆర్సీ వర్తిస్తుంచనుంది. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.10,247 కోట్ల అదనపు భారం పడనుంది. సీఎం ప్రకటనపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు హర్షం ప్రకటించాయి. తాము ఊహించినదానికంటే ఎక్కువే చేసారు అని కొన్ని సంఘాలు ప్రకటించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *