సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: సబ్ కలెక్టర్ శ్రీ సి. విష్ణు చరణ్ , డి.యస్. పి.శ్రీ పి. వీరాంజనేయ రెడ్డి…కలసి నరసాపురం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం విడియో కాన్ఫరెన్స్ హాల్లో డివిజన్ పరిధిలోభీమవరంతో సహా ఇతర తహశీల్దార్లు, పురపాలక కమీషనర్, పోలీస్ , ఎక్సైజ్ తదితర అధికారులతో ” పండుగ రోజుల్లో కోడి పందాలు, అసాంఘిక కార్యకలాపాలు “జరగకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ప్రతీ గ్రామంలో టముకు, దండోరా, మైకు ల ద్వారా మరింత ప్రచారం చేసే విధముగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సబ్ కలెక్టర్ తెలిపారు. పంచాయతీ సెక్రెటరీ, విలేజ్ రెవెన్యూ అధికారులు, అసిస్టెంట్లు,సచివాలయం సిబ్బంది, మహిళా పోలీస్ లను బృందాలుగా ఏర్పాటు చేసామన్నారు.డివిజన్ పరిధిలో ప్రతి గ్రామాలలో ప్రత్యేక టీమ్ లు, మొబైల్ వాహనాలు తో పాటు మండల రెవెన్యూ, పోలీస్ ,డివిజన్ లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశాం,..ఎక్కడయిన అసాంఘిక సంఘటనలు జరిగినా పిర్యాదు చేయదలిస్తే.. సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నెంబరు :8688113733 కు డైరెక్టుగా చెయ్యవచ్చు అన్నారు.
