సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల నే వైసిపి ని ఇంకా ప్రేమిస్తున్నాను అని చెప్పిన నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృషంరాజు.. తాజగా సంచలన ప్రకటన చేశారు. నేడు, శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. వైసిపి పార్టీకి తనపై అనర్హత వేటు వేయించడానికి ఎంత సమయం కావాలో‌ చెప్పాలని, ఒకవారం రోజులు ఎదురు చూస్తానని, వారు నన్ను పార్టీ నుండి బయటకు పంపక పొతే నేనే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని విచితమైన సవాల్ విసిరారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం రాజధాని అమరావతి ఎజెండాతో మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్తానని, ఏ పార్టీ టికెట్ ఫై పోటీ చేస్తానో చెప్పనని, ఇండిపెండెంట్ గా మాత్రం పోటీలో దిగనని ప్రకటించారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో నరసాపురం పార్లమెంట్ ఉప ఎన్నిక ద్వారా నిరూపిస్తానని సవాల్ చేశారు. బీజేపీ అభ్యర్థిగా జనసేన మద్దతుతో టీడీపీ తో లోపాయకారి మద్దతుతో ఎన్నికల బరిలో రఘురామకృష్ణరాజు దిగే అవకాశం కనపడుతుంది. ఐతే ఎంపీ రఘురామా రాజీనామా ప్రకటనను వైసిపి అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి తేలికగా తీసిపారేసారు. తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *