సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో నేడు, శుక్రవారం ఎఐటియుసి అధ్వర్యంలో ఎ.పి.గ్రామ, వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డ్ సచివాలయ వ్యవస్ధలో ఎనర్జీ అసిస్టెంట్లు కడు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని భీమారావు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ వ్యవస్ధలో అన్ని విభాగాల ఉద్యోగులను క్రమబద్ధీకరించి వీళ్లను గాలికొదిలేశారని డ్యూటీ చార్ట్ మించి విధులు కేటాయిస్తూ సెలవులు కూడా లేకుండా 24/7 గంటలు పనిచేయయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7000 మందికిపైగా ఎనర్జీ అసిస్టెంట్లు ఇప్పటి వరకు విధుల్లో ఉంటూ కరెంట్ షాక్ లకు గురయ్యి 160 మంది మృతి చెందారని వారి కుటుంబాలకు ఎక్సుగ్రేషియో ప్రకటించి కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సచివాలయ ఉద్యోగుల మాదిరిగా వీరికి ఇహెచ్ఎస్ హెల్త్ కార్డులు ,సెలవులను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ఎఐటియుసి ఏరియా కార్యదర్శి చెల్లబోయిన రంగారావు, ఎనర్జీ అసిస్టెంట్స్ అసోసియేషన్ నాయకులు యు.అంబెధ్కర్, పాలపర్తి భరత్ తదితరులు మాట్లాడారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి విచ్చేసిన ఎనర్జీ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
