సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కొంతకాలంగా బీజేపీ అధికారంలో ఉన్న మణిపూర్ లో జరుగుతున్నా అల్లర్లు, అష్టి , ప్రాణ నష్టాలు, సమాజం సిగ్గుపడవలసిన మహిళల అవమానకర ఘటనలు దేశవ్యాప్తంగా ప్రజలలో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు, సోమవారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిలాయి. తదుపరి విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడటం గమనార్హం. మణిపూర్ అంశంపై కాంగ్రెస్, ఆర్జేడీ, ఎంఐఎం, వామపక్షాలు, బీఆర్ఎస్ తదితర ప్రతిపక్షాలు ప్రధాని మోడీ సమక్షంలో పూర్తిస్థాయిచర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. పార్లమెంటులో విపక్షాల నిరసన కారణంగా ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ ఆవరణలో కూడా అధికార, విపక్ష పార్టీల ప్లకార్డులతో పోటాపోటీగా ఆందోళనలు చేశారు. పార్లమెంట్ గాంధీ విగ్రహం ఎదుట బీజేపీ ఎంపీలు ఆందోళన చేశారు. బెంగాల్ హింస, రాజస్థాన్లో మహిళలపై నేరాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై పార్లమెంట్లో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. సభను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ నెల 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.
