సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అల్పపీడన ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేటి సోమవారం భారీ వర్షాలు పడుతున్నాయి, దీనిలో భాగం జిల్లా కేంద్రం భీమవరం పట్టణంలో నేటి తెల్లవారు జామునుండి భారీగా కాకపోయినా ఏకబిగిగా ఒక మోస్తరు వర్షం రాత్రి వరకు కురుస్తూనే ఉండటంతో జనజీవనం స్తంభించింది, వ్యాపార వర్గాలకు చికాకు పరచింది, ప్రధాన రోడ్లపై ఏకబిగిగా వర్షం చినుకులతో మట్టి నీళ్లు పారుతూనే ఉండటంతో వాహనాలు స్క్రిడ్ అయ్యే ప్రమాదం ఉండటంతో వాహనాలు వేగం తగ్గింది, వాతావరణ శాఖ సమాచారం ప్రకారం మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి వుండే అవకాశం ఉంది, అయితే పిడుగులు కూడా పడతాయని హెచ్చరికలు ఉన్నాయి,
