సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సీఎం జగన్ సర్కార్ ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆధ్వర్యంలో మార్కె టిం గ్, రెవెన్యూ , కో–ఆపరేటివ్ తదితర శాఖల అధికారుల సమన్వయంతో జిల్లాలో 23చోట్ల మల్టీపర్పస్ గోడౌన్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. రైతులు తమ పంటలనునిల్వ చేసుకుని మద్దతు ధర వచ్చినప్పుడు అమ్ము కోవడం తో పాటు ఎరువులు, విత్తనాలు కూడా నిల్వ చేసుకునేలా ఒక్కొకటి 500 టన్ను ల సామర్థ్యం తో మల్టీపర్ప స్ గోడౌన్ల ను నిర్మిస్తున్నారు, నిజానికి పశ్చి మగోదావరి జిల్లాకు మూడు విడతల్లో129 గోడౌన్లను మంజూరు చేయగా ఫేజ్–1లో 32 గోడౌన్ల నిర్మాణానికి సన్నాహాలుచేసి 23 చోట్ల నిర్మాణాలు చేపట్టారు. వీటి నిర్మా ణాలు వేగంగా సాగున్నా యి. ఆయా మార్కెట్ యార్డ్ పరిధిలో రైతులకు అందుబాటులో ఉంచేలా వీటిని నిర్మి స్తున్నా రు. ఒక్కో గోడౌన్.40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. తొలివిడతలో రూ.9.20 కోట్ల నిధులతో నిర్మాణాలు చేపట్టారు. జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం మెట్టు ఉప్పర గూడెం , మొగల్తూరు మండలంలోని రెండు గోడౌన్లు, పెంటపాడు మండలం రావిపాడు, తణుకు మండలం లోని కొమరవరం లో గోడౌన్లు నిర్మా ణాలు పూర్తయి రైతులకు అందుబాటులో ఉన్నాయి, భీమవరం మండలం తుందుర్రులో గోడౌన్ నిర్మాణానికి సంబంధించి కోర్టు కేసు ఉండటంతో పనులు నిలిపివేశారు. మిగిలిన నిర్మా ణాలను వేగం గా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
