సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: విజయవాడలో నేడు, శనివారం తెలంగాణకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య కు పాల్బడిన ఘటన సంచలనం రేపింది. పోలీసులు సమాచారం ప్రకారం.. స్థానిక కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ కొడుకు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా కృష్ణానదిలో తండ్రీ కొడుకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. గల్లంతైన మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి ఆ కుటుంబం సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను తెలంగాణకు చెందిన వారుగా గుర్తించారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
