సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్:నరసాపురం లో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు మొన్న శనివారం రాత్రి స్టీమర్ రోడ్డులో అధికారులు రోడ్డు కు ఇరువైపులా ఆక్రమణలు తొలగిస్తున్న నేపథ్యంలో వారిని అడ్డుకొనేందుకు అయన తన పార్టీ అనుచరులతో పోలీసులతో వాగ్వాదంకు దిగటం ఆ ఉద్రిక్తలో పోలీసులు లాఠీఛారి చేయడం, పెనుగులాటలో బండారు బట్టలు చిరిగిపోవడం వంటి సంఘటల నేపథ్యంలో పలువురు వ్యాపారులు ఆయన్ను కలసి సంఘీభావం తెలిపారు. మాధవనాయుడు కు మద్దతుగా నేటి సోమవారం మధ్యాహ్నం వరకు పట్టణంలోని పలు దుకాణాలను మూసివేశారు.అయితే నరసాపురం మార్కెట్‌కు ఛాంబర్ లేకపోవడం దీనిపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో బండారు మాధవ నాయుడు తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శనివారం వ్యాపారులకు ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి పూట దుకాణాలను ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమిటని? కేవలం ఎమ్మెల్యే ప్రసాదరాజు ఆదేశాలతోనే అధికారులు వ్యవహరించారని ఆరోపించారు. కోర్టు స్టే ఉందని చెప్పినా లెక్క చేయలేదన్నారు. అడ్డు వచ్చిన వ్యాపారులు, టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జీ చేయడం దారుణమన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు.. నాపై 13 కేసులు పెట్టారు. అయినా ప్రజా సమస్యలపై నా పోరాటం ఆగదు’ అని మాధవనాయుడు అన్నారు. అయితే పోలిసుల వివరణ ప్రకారం .. బండారుపై ఎటు వంటి కేసు నమోదు చేయలేదని సెక్షన్–51 కింద ఆయనతో పాటు మరో 11 మందిని ముందుస్తుగా అదుపులోకి తీసుకుని తరువాత విడిచి పెట్టిన్నట్లు తెలిపారు. .
