సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.విద్యుత్ ఉద్యోగులు తెలుపుతున్న నిరసన కార్యక్రమాలలో భాగం గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సమస్యలపై స్వాతంత్ర సమరయోధులకి వినతి పత్రాలుసమర్పించిన ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఇవాళ, రేపు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని ఉద్యోగుల జేఏసీ తెలిపింది. ఆగస్టు 10 తర్వాత సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధం కావాలని ఉద్యోగులకు విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు 17న విజయవాడ వద్ద ఉన్న విద్యుత్ సౌధ ముట్టడి చేపట్టనున్నట్లు వెల్లడించింది.
