సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల క్రేజ్ కోల్పోయిన తెలుగు బిగ్ బాస్ సీజన్ లకు మరింత ఊపు తో ముందుకు తీసుకోని వెళ్ళడానికి బిగ్ బాస్ నిర్వాహకులు తో కల్సి హోస్ట్ కింగ్ నాగార్జున.కసరత్తులు చేస్తున్నారు. బిగ్ బాస్ 7 గత సీజన్ల మాదిరిగా ఉండదని .. సరికొత్త హడావిడులు, వినోదాలు ఉంటాయని నాగార్జున చెప్తున్నాడు. ఈ మేరకు తాజాగా మరో ప్రోమో రిలీజైంది. ‘ఆరుసీజన్లు చూసేశాం ..అంతా మాకు తెలుసనుకుంటున్నారు కంటెస్టెంట్స్ .. పాపం పసివాళ్లు.. వాళ్లకు తెలీవు కదా.. న్యూ రూల్స్ , న్యూ ఛాలెంజెస్, న్యూ బిగ్ బాస్ ..ఈసారి బిగ్ బాస్ 7.. ఉల్టా పల్టా’ అని ప్రోమోలో చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ 7వ సీజన్ బిగ్ బాస్ .. స్టార్ మా లో సెప్టెంబర్ 3న ప్రారంభం కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ మేకర్స్ ప్లాన్ చేస్తే ఒక వారం ముందైనా రావచ్చు . మరి ఈసారి బిగ్ బాస్ తెలుగు ప్రేక్షుకుల మనస్సు దోచుకొని పాత వైభవం సాధిస్తుందా?
