సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుమల తిరుపతి కొండలలో ఇటీవల పెరిగిన చిరుతపులులు విహారం వాటి దాడులు భక్తులును ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే గత రాత్రి అలిపిరి నడకదారిలో చిరుత దాడిలో లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి మరణించడం తీవ్ర కలకలం రేపింది. నెల్లూరు జిల్లా కొవ్వూరుకు చెందిన లక్షిత కుటుంబం రాత్రి నడక మార్గంలో తిరుమల కొండపైకి బయలు దేరింది. కాలినడకన తిరుమలకు వస్తున్న క్రమంలో రాత్రి 7:30 గంటల సమయంలో లక్షిత తప్పిపోయింది. 10 గంటల వరకూ పాప కోసం వెదికిన కుటుంబ సభ్యులు ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారి కోసం పోలీసులు గాలించగా.. నేటి శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చెట్ల పొదల్లో చిన్నారి మృతదేహం లభించింది. ఒంటిపై గాయాలు ఉండటంతో పాపను చిరుత చంపేసి ఉంటుందని భావిస్తున్నారు. నెల క్రితం ఓ బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రాంతంలోనే చిన్నారి కూడా తప్పిపోవడం గమనార్హం. గుంపుగా కుటుంబసభ్యులు మెట్లు ఎక్కుతున్నపుడే ముద్దులొలికే ఆ పాప ఆడుకొంటూ 2సారులు తప్పిపోయి స్థానిక షాపుల వద్ద దొరికింది అని సమాచారం.. 3వ సారి మాత్రం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *