సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం , అనాకోడేరు రోడ్, గొర్లమూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఏపిఫానియా లూథరన్ చర్చ్ ని నేటి శనివారం ఉదయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు , స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ , YSRCP క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, మేడిది జాన్సన్, ఎంపీపీ , వెంకట నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఇంత పెద్ద స్థాయిలో చర్చ్ నిర్మాణానికి కృషి చేసిన క్రైస్తవ సోదరి, సోదరులకు ఎపిఫానియా లూథరన్ సంఘ సభ్యులకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు.
