సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాలకొల్లుకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యే డా. నిమ్మల రామానాయుడు నేడు, శనివారం తన నియోజకవర్గం పరిధిలోని యలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక వరద బాధితులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ… వారికీ 2వేలు వరద సాయం అందలేదని, గత 15 రోజులు గా వరద నీటి ముంపులో ఉన్న లంక గ్రామాలకు ఒక్క రూపాయి కూడా వరద సాయం అందలేదని …సీఎం జగన్ మాటలు నీటి మూటల్లాగే మిగిలిపోయాయన్నారు. 15 రోజులపాటు పనులు లేక పస్తులతో ఉంటే.. సహాయానికి పార్టీలు చూడం.. అని చెప్పే జగన్ సర్కార్ కు ఇక్కడ వరదముంపులో ఉన్న కుటుంబాలకు 2వేలు చప్పున వరద సాయం అందించే మానవత్వం లేదా? అని ప్రశ్నించారు. . మా లంక గ్రామాలకు కలెక్టర్లు వచ్చారు, ఎస్సీలు వచ్చారు. చూశారు.. సాయం అందించడం మరిచారని ఆరోపించారు. .
