సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పెరూ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఆల్టో నానే జిల్లాలో ఒక చిన్న గ్రామం. అక్కడ గిరిజనులు నివసిస్తారు. అక్కడ గ్రహాంతర జీవులు స్థానిక ప్రజలపై జరుపుతున్న దాడులు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అక్కడ సంచరిస్తున్న వింత జీవులు చూడ్డానికి ‘స్పైడర్-మాన్’ సినిమాలోని గ్రీన్ గాబ్లిన్ తరహాలో కనిపిస్తాయని ఆ గ్రామస్థులు అంటున్నారు. ఏడు అడుగులు ఎత్తుంటే ఆ జీవుల కళ్లు పసుపు రంగులో ఉంటాయన్నారు. వాటి తలలు చాలా పొడవుగా ఉన్నాయని పేర్కొంటున్నారు. అవి జనాల మధ్యలోకి అకస్మాత్తుగా వచ్చి, పలువురిపై దాడులు చేసి పారిపోతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా.. అవి మనుషుల ముఖానికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. నెల రోజుల క్రితం ఈ వింత జీవులు 15 ఏళ్ల బాలికపై దాడి చెయ్యగా ఆమె మెడకు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.. ఈ వింత జీవులు రాత్రిపూట ఊరిలో సంచరిస్తూ.. భయానక పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. రాత్రిపూటే ఇవి ఆకస్మికంగా బయటకొస్తున్న తరుణంలో.. వాటి రూపాల్ని సరిగ్గా గమనించలేకపోతున్నారు. రక్షణ కోసం రాత్రిపూట ఊరి బయట కొందరు కాపలాగా ఉంటున్నారు. ఈ గిరిజన నాయకుడైన జైరో రేటెగుయ్ అవిలా మాట్లాడుతూ.. తాను ఆ వింతజీవుల్లో ఒకదాన్ని గన్తో రెండుసార్లు కాల్చానని, అయితే దానికి ఎలాంటి గాయం కాలేదని తెలిపాడు. అవి కచ్ఛితంగా ఏలియన్స్ అయ్యుండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. తాము ఈ విషయంపై మిలిటరీ నుంచి కూడా సహాయం కోరామని చెప్పాడు.
