సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: వయస్సు 60 దాటినా విజయాల దాహం తీరని విక్టరీ హీరో వెంకటేష్ మొన్నటి ఎప్ 3 హిట్ మరల ఓరిదేవుడా సినిమా లో ప్రత్యేక పాత్రలో మరో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక తాజగా తన 75 వ సినిమాగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సైంధవ్’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. హిట్’ సినిమాల శైలేష్ కొలను దర్శకుడు. వెంకట్ బోయినపల్లి నిర్మాత. నవాజుద్దీన్. సిద్దిఖీ, శ్రద్దా శ్రీనాథ్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో క్లైమాక్స్ చిత్రీకరించారు. వెంకటేశ్, నవాజుద్దీన్ తదితరులపై 16 రోజుల పాటు తెరకెక్కించిన కోట్లాది రూపాయలు ఖర్చుతో ఈ భారీ పోరాట దృశ్యానికి రామ్-లక్ష్మణ్ నేతృత్వం వహించారు. డిసెంబరు 22న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామ’’ని నిర్మాత తెలిపారు. సంగీతం: సంతోష్ నారాయణ్.
