సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: వరుస సెలవులు నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లేవారి కోసం భీమవరం మీదుగా రేపు ఎల్లుండి అంటే ఈ నెల 15, 16 తేదీల్లోనరసాపురం –సికిం ద్రాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. 07169 సర్వీస్ నెంబర్ 15వ తేదీ మంగళవారం నరసాపురంలో సాయంత్రం 6 గంటలకు నరసాపురం నుంచి రైలు బయలుదేరి పాలకొల్లు, భీమవరం , ఆకివీడు, గుడివాడ, విజయవాడ మీదుగా మరుసటిరోజు తెల్లవారుజామున ఉదయం 3.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మళ్లీ బుధవారం అదే రైలు సికింద్రాబాద్ లో రాత్రి 11.30 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.35 గం టలకు భీమవరం మీదుగా నరసాపురం చేరుకుం టుంది. కాబట్టి ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *