సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం లో నేడు, శుక్రవారం టీడీపీ అధినేత, చంద్రబాబు పర్యటించారు. నేటి ఉదయం మాజీ లోక్ సభ స్పీకర్ బాలయోగి సమాధిని సందర్శించి నివాళ్లు అర్పించారు. మధ్యాహ్నం స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహించారు. నేటి శుక్రవారం రాత్రి అమలాపురం సెంటర్ లో బహిరంగ సభలో మాట్లాడుతూ… “జగన్ పాలనలో ప్రజలకు పన్నులు, విద్యుత్ చార్జీలు పెంచారు. వ్యవస్థలను నాశనం చేశారు. రహదారులు గోతులమయంగా తయారయ్యాయి. రోడ్లపై ప్రయాణం చేస్తే నరకం కనిపిస్తుంది. ఇసుకాసురులు తయారయ్యారు. పేదవాళ్ళని జగన్ దోచేశారు. నా ఎస్సీలు కాబట్టి నేనే చంపేస్తానంటున్నారు వైసీపీ వాళ్ళు.. జగన్ రాష్ట్రానికి పట్టిన కేన్సర్ గడ్డ. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను చిత్తు చిత్తుగా ఓడించాలి. యువత మా సైన్యం. పోలవరం, అమరావతి కోసం పోరాడుతున్నాను. వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రజలను అంధకారంలో నెట్టేశారు. ఏదైనా సమస్యలపై ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పైనా అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కోనసీమలో కొబ్బరి రైతులు ఆనందంగా ఉన్నారా? కొబ్బరికి గిట్టుబాటు ధర ఉందా.?” అని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు.. up update photo
