సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యం లో జాతియ దేవాలయ ప్రవేశ ఉత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమoలో RSS నాయకులు మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకొన్నారు. భక్తులకు పత్యేక పూజలు చేయించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్, వి హరిసూర్య ప్రకాష్ ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్ కారెంపూడి ఆదిలక్ష్మి మిర్తిపాటి గున్నేశ్వరావు మల్లువలస లక్ష్మి నిర్మల గొంతెన రమణ యండ సత్యవతి పాపోలు ఏడుకొండలు మరియు పశ్చిమ గోదావరి జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ అధికారి వి వెంకటేశ్వరరావు భీమేశ్వర స్వామి దేవస్థానం ఈ ఓ తోట శ్రీనివాస్ పాల్గొని భక్తులకు ప్రసాదం అందించారు.
