సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యా ప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై విద్యా శాఖ నిషేధం విధించింది. ఇకపై పాఠశాలలకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తేవటం పై పూర్తి నిషేధం విధిస్తూ మోమో జారీ చేసింది. ఉపాధ్యాయులు సైతం తరగతి గదుల్లోకి ఫోన్లు తీసుకురాకుండా ఆంక్షలు విధించింది. టీచర్లు తరగతి గదులకు వెళ్లేముందు తమ మొబైల్స్ ను హెడ్ మాస్టర్ కి అప్పగించాలని ఆదేశించింది. యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా ఇకపై క్లాస్ లలో విద్యారుల బోధనకు ఎటువంటి ఆటంకం రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్న ట్లు ప్రకటించింది.
