సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి ఖ్యాతిని, పౌరుషాన్ని చాటిచెప్పిన మహనీయుడు, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు (NTR) శతజయంతిని పురస్క రించుకుని 100 రూపాయల విలువైన స్మారక నాణాన్ని నేడు, సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాణెం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. భారత చలనచిత్ర రంగం సాధించిన ప్రగతి లో, పురాణ పాత్రలలో , రాజకీయాలలో తనదయిన సత్తా చాటి జాతిని ప్రభావితం చెయ్యడంలో స్వర్గీయ ఎన్టీఆర్ పాత్ర కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. రాముడు, కృష్ణుడిగా ప్రజల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు.
