సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : జియో కొత్త సాంకేతిక ప్రభంజనాన్ని సృష్టించనుంది. జియోఎయిర్ ఫైబర్ సాయంతో ఇంట్లో వైఫై రూటర్ తరహాలో ఎటువంటి కేబుల్ వైర్లు లేకుండా ఇంట్లో 5జీ ఇంటర్నెట్, హాట్ స్వాట్ ద్వారా మొబైల్ ,టీవీ ,కంప్యూటర్స్, లాప్ టాప్ లకు దీని సేవలు వినియోగించుకోవచ్చు..వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఎయిర్ ఫైబర్ డివైజ్ ను ఆఫ్, ఆన్ చేస్తే సరిపోతుంది. సులభంగా, వేగంగా ఇంట్లో, జియో ఎయిర్ ఫైబర్ తో నెట్ సేవలను వినియోగించుకొని కార్యక్రమాలను చూసెయ్యవచ్చు. దీనిని ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సాధారణంగా బ్రాండ్ బ్యాండ్ సేవలు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా అందిస్తారు. ఈ సేవలను పొందాలంటే కేబుల్ వైర్ తో పాటు, మోడెమ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక వీటి అవసరం ఉండదు. తాజా గా… జియోఎయిర్ ఫైబర్ టెక్నాలజీ వినియోగించే తీరు గురించి జియో వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. అందులో ఇంట్లో జియో ఫైబర్తో పిల్లలు వినియోగించే యాప్స్, వెబ్ సైట్ లను కుటుంబ సభ్యులు సులభంగా కంట్రోల్ చేయొచ్చు .5జీ నెట్ వర్క్ తో 1.5జీబీ పీఎస్ స్పీడ్ పొందవచ్చునని ప్రకటించింది. ఇంకా అధికారికంగా ధరలు ప్రకటించినప్పటికీ.. ఇప్పటివరకు ఆప్టిక్ ఫైబర్ ద్వారా కేబుల్ టివి సర్వీసులు, ఇంటర్నెట్ అందిస్తున్న పలు సంస్థలు తీవ్రపోటీని ఎదురుకొనే అవకాశం మాత్రం స్వష్టంగా ఉంది.
