సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లో డ్రగ్స్ కేసుల లో పలుసార్లు సినీ ప్రముఖుల పేర్లు తరుచు బయటకు రావడం తరువాత దర్యాప్తులు నత్తనడక సాగడం ఆనవాయితీగా వస్తుంది, అయితే తాజగా.. ఒకనాడు యువహీరోగా రాణించిన నవదీప్ ఇప్పడు వెబ్ సిరీస్ లో మంచి గుర్తింపు తెచ్చుకొన్నాడు. సినీరంగంలో మంచి ప్లే బాయ్ ఇమేజ్ ఉన్న నవదీప్ గురించి మాదాపూర్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నా యి . ఈ కేసులో డ్రగ్స్ తీసుకున్న వారిలో హీరో నవదీప్ కూడా ఉన్నారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేడు, గురువారం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు పేర్కొన్నాడు. నవదీప్ స్నేహితుడు రాంచందర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇచ్చి న స్టేట్మెంట్ లో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘బేబీ’ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ ప్రోత్సహించే విధంగా బేబీ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని.. ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్‌లో రైడ్ చేసినప్పుడు ఉన్న సీన్ చూస్తే.. సేమ్ టు సేమ్ ‘బేబీ’ సినిమాలో ఉన్నట్లే కనిపించాయని సిపి ఆనంద్ ఫైర్ అయ్యారు. ఇక గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ అభియోగాలు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఎక్సైజ్, ఈడీ విచారణకు కూడా ఆయన హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *