సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో పనికిమాలిన చెత్త , కల్పిత రొమాన్స్ , భారీ ఏడుపుకొట్టు సీన్స్ లేకుండా ఓన్లీ డిఫెన్స్ ఫైట్స్ , సరికొత్త గేమ్స్ తో బిగ్‌బాస్‌కు పూర్వ వైభవం వచ్చింది. ‘ఉల్టా- పుల్టా’ తరహా సీజన్ బాగానే ఉంది. గత సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ ఎన్నో రేట్లు వేగంగా ప్రేక్షకుల ఆదరణ రెట్టింపు అయిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. షో కు అక్కినేని నాగార్జున హోస్టుగా ‘బిగ్ బాస్ సీజన్ 7’ ప్రేక్షక ఆదరణలో తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సరికొత్త ప్రమాణాలను సృష్టించిందని ఏకంగా టీఆర్పీ రేటింగ్ 18 పాయింట్స్ దాటేసిందని ‘స్టార్ మా’ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు ఇప్పుడు ఈ షో చూస్తున్నారనీ, ఇంచుమించు 5.1 కోట్ల మంది ప్రేక్షకులు మొదటి వారం ‘బిగ్ బాస్’ షో చూశారని గణాంకాలు చెబుతున్నాయి.
