సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్‌ని పూర్తిగా బాయ్‌కాట్ చేయాలని టీడీపీ నిర్ణయించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. సభలో వైసిపి నేతలు తమ హక్కులకు భంగం కలిగించడంతో ఈ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించినట్టు వెల్లడించారు. చంద్రబాబు ఫై పెట్టిన అక్రమ కేసులు గురించి కాదు.. శాసనసభలో ప్రభుత్వ అవినీతిపై చర్చించే దమ్ముంటే 5 రోజులు చర్చ పెట్టండి, జగన్ అవినీతిపై అసలు సినిమా చూపిస్తాం. శాసనసభను వైసిపి పార్టీ కార్యాలయంలా మార్చేశారు.. మా సభ్యులను తీవ్రంగా అవమానిస్తున్నారు. ’’ అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అధికారపక్షం తీరుకు నిరసనగా సమావేశాలు బహిష్కరించాలని నిర్ణయించామని, రేపటి నుంచి (శనివారం) శాసనసభ, మండలికి హాజరుకాబోమన్న అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు
