సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ అధినేత చంద్రబాబు తనపై సీఐడి కేసుల నుండి రక్షణ కోసం ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు లో క్వా ష్ పిటిషన్ వేశారు అయితే చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను నేడు, శుక్రవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్మి స్ చేసింది. క్వా ష్ పిటిషన్ను కొట్టేస్తున్న ట్లు ‘పిటిషన్ డిస్మిస్డ్’ అం టూ ఏకవాక్యంతో తీర్పు ఇచ్చారు హైకోర్టు న్యా యమూర్తి. ఇక కోర్ట్ విడుదల చేసిన 68 పేజీలతో కూడిన చంద్రబాబు క్వాష్ ఆర్డర్ కాపీలో ఏపీ హైకోర్టుల కీలక వ్యా ఖ్య లు చేసింది. స్కిల్ స్కాంలో 2021 నుంచి 140 మందిని సీఐడీ సాక్షులను విచారించింది. నాలుగు వేల దాకా డాక్యుమెంట్లు సేకరించింది. ఇంత దర్యాప్తు జరిగాక,విచారణ కీలక దశలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆపడం సరికాదు.’ అని స్పష్టం చేసింది..అసాధారణ పరిస్థితుల్లో ఉంటేనే ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలి. ఎఫ్ఐఆర్లో అన్ని విషయాలు ఉండాల్సిన అవసరం లేదు. విచారణ పూర్తి చేసే అధికారాన్ని పోలీసులకు ఇవ్వాలి. సీఆర్పీసీ 482 క్రింద దాఖలైన పిటిషన్ ఫై మినీ ట్రయల్ నిర్వహించలేం. ఇక చంద్రబాబు లాయర్లు సుప్రీం కోర్ట్ కు వెళ్లే యోచనలో ఉన్నట్లు భావిస్తున్నారు. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు రిమాండ్ను అవినీతి నిరోధక శాఖ న్యా యస్థానం (ఏసీబీ కోర్టు) రెండ్రోజులు పొడిగించిన సంగతి తెలిసిండే.
