సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాట, తెలుగునాడులో మంచి క్రేజ్ ఉన్న హీరో చియాన్ విక్రమ్ రీసెంట్ గా మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్ని యన్ సెల్వ న్ 2’లో ఆదిత్య కరికాలన్‌గా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా చియాన్ విక్రమ్ పా.రంజిత్ ప్రయోగాత్మక చిత్రం ‘తంగళన్’ షూటింగ్‌ను కూడా ముగించాడు. ఆ సినిమా లో గాయాలు పాలయి కోలుకున్న తర్వాత చియాన్ ఏ కొత్త చిత్రాన్ని కూడా ఒప్పు కోలేదు.. అయితే ఇప్పు డు విక్రమ్ హీరోగా దర్శకుడు ఆర్.ఎస్.విమల్ మెగా ఎపిక్ ‘సూర్యపుత్ర కర్ణ’చిత్రీకరణ త్వరలో పునః ప్రారం భించనున్న ట్లు తన ఫేస్‌బుక్ పేజీలో అధికారికంగా ప్రకటించారు. విక్రమ్ టైటిల్ రోల్‌లో కొన్ని సంవత్సరాల క్రితం ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ సెట్స్‌ పైకి వెళ్లి కొన్ని యుద్ధ సన్ని వేశాలను కూడా భారీ స్థాయిలో చిత్రీకరించారు. కానీ అప్ప ట్లో రకరకాల కారణాలతో కొన్నే ళ్లుగా చిత్రీకరణ ఆగిపోయింది. అయితే విక్రమ్ ముందుగా ఆ సినిమా పూర్తిచేయాలని నిర్ణయించాడు. మరోవైపు కర్ణకు సంబంధించిన తాజా వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుం టుం ది ఈ వీడియోని చూస్తుంటే బాహుబలి రేంజ్ లో చిత్రీకరించారని అర్ధం అవుతుంది. ఇంకా మిగిలిన నటీనటులు- సిబ్బందికి సంబంధించిన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *