సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రముఖ సీనియర్ హీరో సుమన్ .. స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పై సుమన్ స్పందించారు. పాలిటిక్స్ లో ఇదొక గుణపాఠం అన్నారు. నేడు సోమవారం నాడు ఆయన ఫిలిం ఛాంబర్లో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు అన్ని ఆలోచించాకే అరెస్ట్ చేసి ఉంటారు. సీఎం వైఎస్ జగన్ వల్లే చంద్రబాబు జైలుకు వెళ్ళాడంటున్నారు. కానీ, అది నిజం కాదు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి చాలా కారణాలు ఉండి ఉంటాయి. ‘చంద్రబాబు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా చూసి చెప్పే జ్యోతిష్కుడు ఉంటే ఆయన ఎప్పుడూ బయటకు వస్తాడో తెలుస్తుంది. ఆయన టైం బాగోలేదు. టైం అనేది బాగుంటే లోకల్ కోర్టులో కూడా అన్నీ అనుకూలంగానే జరుగుతాయి. ఆయనకు అన్నీ అనుకూలంగా వచ్చే వరకు జైలులొనే ఉంటారు. సమయం మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి’అని సుమన్ గమ్మత్తుగా మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *