సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినిమా చరిత్రలో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకు ప్రత్యక స్థానం ఉంది, ఇప్పటికి టివిలో ఎన్నిసార్లు చుసిన బోర్ కొట్టదు సరికదా! మరోసారి సరికొత్త అనుభూతిని తప్పక మిగులుస్తుంది, మల్టి స్టార్ హీరోలు వెంకటేష్, మహేష్ బాబు లు పెద్దోడు- చిన్నోడు పాత్రలలో సొంత అన్నదమ్ములుగా ‘ఏరా .. ఇంకేమిటిరా బాబు? అంటూ.. వారి కెమిస్ట్రీ తో తెలుగు కుటుంబాలలో ఇప్పటికి సభ్యులు గా ప్రభావం చూపుతున్నారు. ఇక రేలంగి మామయ్య గా ప్రకాష్ రాజు ఒదిగిపోయాడు. ఇక శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అంతులేని అభిమానులున్నారు. మరి ఇలాం టి సినిమాకు పార్ట్-2 తీస్తే ఎలా ఉంటుంది? ఈ ఐడియా నేరుగా దిల్ రాజుకే వచ్చింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాకు సీక్వెల్ చేద్దామంటూ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దగ్గర ప్రపోజల్ పెట్టారు రాజు. ఈవిషయాన్ని స్వ యంగా ఆ దర్శ కుడే మీడియా తో తాజగా బయటపెట్టాడు.”రీసెంట్ గానే దిల్ రాజు నాతో అన్నారు. తెల్లారి 4 గంటలకు ఓ ఐడియా వచ్చింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు పార్ట్-2’ చేద్దాం , ప్రిపేర్ అయిపోమన్నారు. మళ్ళి వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ కు తగ్గ కధ సెట్ తయారు చేస్తాను. ఆ క్రేజ్ ను కొనసాగించాలంటే దానికి తగ్గ కథ ..మంచి కుటుంబ విలువలు ఉండాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు.. సినిమాలో సీక్వెల్ చేయగల స్టఫ్ ఉందన్నారు. దర్శ కుడు శ్రీకాంత్ అడ్డాల.వెంకీ తో తీసిన నారప్ప తరువాత ప్రస్తుతం తాను తీసిన పెదకాపు-1 సినిమాప్రమోషన్ లో బిజీగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *