సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలో చంద్రబాబు అరెస్ట్ దరిమిలా .. కొందరు వ్యక్తులు టీడీపీ మద్దతు దారులు ఇద్దరు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై హైకోర్టులో దాఖలు అయినా క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కోర్టులలో పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులకు సంబంధించి ఇద్దరు న్యాయమూర్తులపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని కోర్టు పేర్కొంది.పోస్టులు పెట్టినవారి ఐడీలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వీరిలో టీడీపీ కీలక నేతలు బుద్ధా వెంకన్నతో సహా మొత్తం 26 మంది పేర్లను అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. గూగుల్, ట్విట్టర్, ఫేస్ బుక్‌లను కూడా పిటిషన్లో పేర్కొనడం జరిగింది కోర్టు ధిక్కరణ కింద పరిగణలోకి తీసుకొని వీరందరి ఐడీలను గుర్తించి నోటీసులు పంపాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది..ఇటీవల రాష్ట్ర పతి భవన్ కూడా ఏపీలో న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నవారిపై చర్యలకు ఆదేశించిన విషయం గమనార్హం..
