సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌(డీపీహెచ్‌&ఎ్‌ఫడబ్ల్యూ)- కాంట్రాక్టు ప్రాతిపదికన స్టాఫ్‌ నర్సుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 434 పోస్టులు ఉన్నాయి. ఒప్పంద వ్యవధి ఏడాది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను సంబంధిత జోన్‌లోని మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రీజనల్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో అందజేయాలి. అర్హత: అభ్యర్థులు జనరల్‌ నర్సింగ్‌ & మిడ్‌ వైఫరీ/బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 2023 జూలై 1 నాటికి 42 ఏళ్లు మించకూడదు. రిజర్వ్‌డ్‌ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.500; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300దరఖాస్తు అందజేసే చివరి తేదీ: అక్టోబరు 5 ఇతర వివరాలకు వెబ్‌సైట్‌: http://cfw.ap.nic.in ను సంప్రదించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *