సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అక్టోబర్ 3వరకు సుప్రీం కోర్ట్ చంద్రబాబు క్వాష్ పిటిషన్ కేసు వాయిదా వేసేయడంతో టీడీపీ శ్రేణులు డీలా పడిపోయాయి. చంద్రబాబు అరెస్ట్ ను అసెంబ్లీ చర్చలో ప్రభుత్వాన్ని నిలదీస్తాడు అనుకొన్న బాలయ్య అక్కడ బాలకృష్ణుడి లీలలు ప్రదర్శించడం తో అందరు విస్తుపోయారు. మరో ప్రక్క..తండ్రి అరెస్ట్ తరువాత పార్టీ క్యాడర్ కి దిశా నిర్దేశ్యం చెయ్యవలసిన లోకేష్ ఢిల్లీకే పరిమితమయ్యారు. రేపటి శుక్రవారం నుండి తిరిగి తూర్పు గోదావరి జిల్లాలో లోకేష్ పాదయాత్ర మొదలు పెడతారని ప్రకటించినప్పటికీ తాజాసమాచారం ప్రకారం.. పాదయాత్ర ను లోకేష్ వాయిదా వేశారు. మరో ప్రక్క ఏపీలో నారా లోకేష్ అరెస్ట్ కు పలు అవినీతి కేసులు సిద్ధంగా ఉన్నాయి. దీనితో ఇక జరగబోయే ఘటనలను మొండి ధర్యం తో ఎదుర్కోవాలని టీడీపీ పెద్దలు సిద్ధమౌతున్నారు. ఇదిలా ఉంటే.. లోకేష్‌ను ఒకవేళ అరెస్టు చేస్తే.. అదే ముహూర్తానికి పాదయాత్ర మొదలుపెట్టేందుకు ఆయన సతీమణి నారా బ్రాహ్మణి సిద్ధంగా ఉంటారని టీడీపీ శ్రేణులు వార్త ను వైరల్ చేస్తుంది. అయితే చంద్రబాబు భార్య, కోడలు ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు .. కేసులో 6వ నిందితునిగా సీఐడీ చేర్చడం మరో పెను ముప్పు సూచిస్తుంది .. ఏది ఏమైనా నారా, నందమూరి కుటుంబాలకు చెందిన బ్రాహ్మణి పాదయాత్ర చేస్తే ప్రజల్లో సానుభూతి ఎక్కువగా వస్తుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అష్ట దిగ్బంధనం లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదురుకొంటుందో? జనసేన మద్దతు ఏ మేరకు మేలు చేస్తుందో వేచి చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *