సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి గురువారం నుండి భీమవరం రూరల్ సిఐగా ఛార్జి తీసుకొంటున్న బి సత్య కిషోర్ స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంఎల్ఎ గ్రంధి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఎంఎల్ఎ గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విధినిర్వహణలో ప్రజల మన్నలను పొందాలని .. శాంతి భద్రతల విషయంలో రాజీ పడకూడదని సూచించారు.తదుపరి ఎమ్మెల్యే గ్రంధి నేడు, గురువారం ఆర్ అండ్ బి అధికారులు ఇ ఇ లోకేశ్వరరావు, డిఇ రామరాజులు తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భీమవరం నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఏమైనా,, పెండింగ్ లో ఉన్న సమస్యలును తన దృష్టికి తెచ్చి పనులు స్వత్వరం పూర్తీ చెయ్యాలని ఆదేశించారు,
