సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నారా లోకేష్ అరెస్ట్ కు రంగం సిద్ధం అవుతున్న సూచనలు స్వష్టంగా కనపడుతున్నాయి. దీనిని ముందే పసిగట్టి లోకేష్ ఏపీ హైకోర్టు లో 2కేసులలో ముందస్తు బెయిల్ కోసం వేసుకొన్న నేపథ్యంలో ..మొదటగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలో..పిటిషన్ ఫై నేడు, విచారణ చేప్పట్టిన హైకోర్టు.. సీఐడీ అధికారులకు విచారణకు నారా లోకేష్ సహకరిస్తే మంచిదని ఆదేశిస్తూ,, ముందస్తు బెయిల్ అంశాన్ని ప్రక్కకు పెట్టింది. దీనితో లోకేష్ కు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడానికి సీఐడీ అధికారులు నేడు, శుక్రవారం ఢిల్లీ చేరుకొన్నారు. విచారణకు సహకరించని పక్షంలో.. తదుపరి పరిణామాలు లో ఏ క్షణంలోనైనా లోకేష్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో టీడీపీ నారా లోకేష్‌కు ఊరట దక్కింది. ఏపీ హైకోర్ట్ ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 4వరకు లోకేష్‌ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్ట్ ఆదేశాలిచ్చింది. కాగా ఈ కేసులో ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే.
