సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం సీఎం జగన్ విజయవాడలో వేలాది ఆటో రిక్షా డ్రైవర్స్ సమక్షంలో ఐదో విడత వైఎస్సార్ వాహనమిత్ర నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. సీఎం జగన్ ఖాకి చొక్కా ధరించి వేదికపై డ్రైవర్స్ నేతలతో కలసి 2,75,931 మందికి పది వేల చొప్పున 275.93 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో వేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘నిరుపేదల కోసం నిలబడిన మన ప్రభుత్వం ఒక వైపు ఉంటే.. నిరుపేదలను వేధించేవారు వారు మరొక పక్క ఉన్నారు. సామాజిక అన్యాయాలు చేసే ప్రత్యర్థులతో యుద్ధం జరగబోతుంది. అడుగడుగున అవినీతి చేసి మహిళల డబ్బు, రైతుల డబ్బు, నిరుద్యోగుల డబ్బు, దోచుకొన్న చంద్రబాబు అతని గజదొంగల ముఠా, దత్తపుత్రుడు తో కూడిన మోసపూరిత దొంగ మాటలు వినకండి.. అవినీతి పరులు అందరు జైలు కు పోతున్నారు. త్వరలో ఎన్నికల కురుక్షేత్రం జరుగుతుంది. పెత్తందారులతో యుద్ధం జరగబోతుంది. 2 లక్షల 35 వేల కోట్లు లంచాలకు అవకాశం లేకుండా అర్హులయిన లబ్ధిదారులకు నేరుగా అందచేశాం. పేద విద్యార్థులకు ఇంగ్లీలిష్ మీడియం చెప్పిస్తున్నాము ,మనం ప్రజలు పక్షాన పోరాడతాం.. మన వైసిపి ప్రభుత్వం మ్యానిఫెస్టో లో ఉన్న అన్ని హామిలను 99 శాతం అమలు చేశాం. నా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి లబ్ది జరిగిందని భావిస్తేనే నాకు వచ్చే ఎన్నికలలో ఓటు వెయ్యండి అని సీఎం జగన్ పిలుపు నిచ్చారు
