సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 22 రోజులుగా జైలు లో గడుపుతున్న చంద్రబాబు ఇప్పట్లో కోర్ట్ కష్టాలు వదిలేలా లేవు.. చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లోసం చలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసును ఈ నెల 4న సుప్రీం కోర్టు విచారించనుంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ ను రేవంత్ రెడ్డి ద్వారా ప్రలోభాలకు గురిచేసిన విషయం విదితమే. ఈ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు ని ముద్దాయిగా చేర్చాలని, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారు. ఓటుకు కోట్లు కేసును తెలంగాణ ప్రభుత్వం తగిన విధంగా దర్యాప్తు చేయడం లేదని, పూర్తి ఛార్జిషీటు వేయలేదని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఎమ్మె ల్యే ఆళ్ల.. దాఖలు చేసిన మరో పిటిషన్ను సుప్రీం కోర్టు 4న విచారించనుంది. ఈ కేసుకు భయపడే చంద్రబాబు తెలుగు రాష్ట్రాల కు 10 ఏళ్ళ ఉమ్మడి రాజధాని గా ఉన్న హైదరాబాద్ ఫై ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు హక్కులను ఆస్తులను వదులుకొని అకస్మాత్తుగా అమరావతి కి పారిపోయి వచ్చారని వైసిపి నేతల ప్రచారం జరిగింది. మరల ఇదే కేసు ఇప్పుడు ప్రాణం పోసుకొంది ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *